News29th Jul 11:04 AMSunil Byrisetty1 min read
ఏఐ ఆవిష్కరణల కేంద్రాలుగా అమరావతి,విశాఖ
ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ప్రముఖ ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు పని చేస్తున్నాయి. అమరావతి, విశాఖపట్టణం లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లు
ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ప్రముఖ ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు పని చేస్తున్నాయి. అమరావతి, విశాఖపట్టణం లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లు ఆవిష్కరణ కేంద్రాలుగా నిలుస్తాయని ఆర్టీఐహెచ్ సీఈవో ధాత్రి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కృత్రిమ మేధస్సు, డీప్ టెక్ రంగాల అభివృద్ధిని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించామన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ఐటిఈసీ శాఖ వీటిని మంజూరు చేశాయన్నారు. స్టార్టప్ లకు నాణ్యమైన మెంటార్ షిప్, ఆధునిక మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ యాక్సెస్, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యకరణకు అవసరమైన సహకారాన్ని అందించడంతో పాటు విద్యా ,పరిశోధనా సంస్థలతో సమన్వయాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.