News11th Jan 11:36 AMSunil Byrisetty1 min read
అట్టహాసంగా ముగిసిన ‘అమరావతి ఆవకాయ్’
తెలుగు వారి సంస్కృతికి, రుచులకు, కళలకు ప్రతిబింబంగా నిలిచిన ‘అమరావతి ఆవకాయ్’ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా మూడు రోజుల పాటు జరిగిన ఈ వే
తెలుగు వారి సంస్కృతికి, రుచులకు, కళలకు ప్రతిబింబంగా నిలిచిన ‘అమరావతి ఆవకాయ్’ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఏడాది 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన అధికారికంగా ప్రకటించారు. మూడు రోజుల్లో భవానీ ఐలాండ్‌కు 15 వేల మంది, పున్నమి ఘాట్‌కు 30 వేల మంది.. మొత్తంగా 45 వేల మందికి పైగా సందర్శకులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.