News24th Jan 10:49 AMSunil Byrisetty1 min read
1.77 లక్షల ఎకరాలకు అమరావతి
రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాను రెండవ దశ పూలింగ్ జరిగే గ్రామాలకు విస్తరించడంతోపాటు, ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు పూర్తిస్థాయి ప్రణా
రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాను రెండవ దశ పూలింగ్ జరిగే గ్రామాలకు విస్తరించడంతోపాటు, ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు పూర్తిస్థాయి ప్రణాళిక తయారు చేయడానికి ఆసక్తి వ్యక్తికరణ టెండర్లు పిలిచారు. దీనికోసం రూపొందించిన నోట్లో అనేక కీలక అంశాలు పొందుపరిచారు. అమరావతి రాజధాని నగర మాస్టర్లోనును రెండోదశలో 20,494 ఎకరాలకు విస్తరించడంతోపాటు దానికి అనుసంధానంగా 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలు కలిపి సుమారు ఒక లక్షా 77 వేల ఎకరాలకు నిర్మాణ ప్రణాళికను రూపొందించాలని ఈ నోట్లో ప్రతిపాదించారు. ఇప్పటికే తొలి దశలో సమీకరించిన 53 వేల ఎకరాలతో కలిపి 2.30 లక్షల ఎకరాలకు మాస్టర్ ప్లాన్ చేరనుంది. అయితే, రెండవ విడతకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ నోట్లో ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని స్పష్టంగా పేర్కొన్న ప్రభుత్వం దానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తోంది.