News7th Aug 12:14 PMSunil Byrisetty1 min read
సిద్ధమవుతున్న రాజధాని భవనాలు
అమరావతి రాజధానిలో ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస సముదాయాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తరచుగా సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్న విషయం తెల
అమరావతి రాజధానిలో ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస సముదాయాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తరచుగా సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలోని శాసన సభ్యుల నివాస గృహ సముదాయాలను జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ పరిశీలించారు. శాసన సభ్యుల నివాస గృహ సముదాయాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవనాలు, మౌలిక వసతులు, పరిసరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ నెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.