News29th Sep 03:17 PMSunil Byrisetty1 min read
శరవేగంగా అమరావతి పనులు
రాజధాని అమరావతిలో అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగ కార్యాలయాలు ఉండేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. శరవేగంగా నిర్మాణాలు ప్రారంభించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ప్రభుత్వ రంగ బ్
రాజధాని అమరావతిలో అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగ కార్యాలయాలు ఉండేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. శరవేగంగా నిర్మాణాలు ప్రారంభించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఆయన రంగంలోకి దించుతున్నారు. పన్నెండు బ్యాంకులు ఇప్పుడు అమరావతిలో రాష్ట్ర స్థాయి కార్యాలయాల నిర్మాణాన్ని ఒకే సారి ప్రారంభించబోతున్నాయి. ఆర్థిక నగరంలో వీటికి కేటాయించిన స్థలాలను చదును చేసి ఇచ్చేశారు. ఇప్పుడు బ్యాంకులు నిర్మాణాలు ప్రారంభించబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకే రోజు అన్ని కార్యాలయాలకు శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాల్లోనూ నిర్మాణాలు ప్రారంభించేలా చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు.