News21st Jul 06:06 PMSunil Byrisetty1 min read
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి
గత ప్రభుత్వం అమరావతి రైతులతో పాటు కాంట్రాక్టర్లను కూడా అనేక ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో కచ్చితంగా పూర్తిచేసి తీరుతామ
గత ప్రభుత్వం అమరావతి రైతులతో పాటు కాంట్రాక్టర్లను కూడా అనేక ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో కచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మరోసారి స్పష్టం చేసారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను సీఆర్డీఏ ఇంజినీర్లతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. మంత్రులు,హైకోర్టు న్యాయమూర్తులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శుల బంగ్లా లతో పాటు ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయా నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ సంస్థల ప్రతినిధులను వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.