News28th Nov 04:01 PMSunil Byrisetty1 min read
ఆర్థిక కేంద్రంగా అమరావతి
రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదని, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం
రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదని, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తోన్న ప్రోత్సాహం ఎంతో విలువైనదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా, జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికీ కనబడేలా జవాబుదారీతనంతో మా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఎల్ఐసీ లాంటి 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకేసారి, ఒకే చోట కొలువుదీరనుండటం చాలా అరుద’’ని పేర్కొన్నారు. నేడు పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్.. అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగని అభిప్రాయపడ్డారు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకే చోట కొలువుదీరడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు వేగం పుంజుకుంటాయని చెప్పారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని, ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుందని వ్యాఖ్యానించారు.