News5th Dec 04:52 PMSunil Byrisetty1 min read

గ్రీన్ సిటీగా రాజ‌ధాని అమ‌రావ‌తి

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు స్వ‌ప్న‌మైన ప్ర‌జా రాజ‌ధాని అమ‌రావ‌తిని ఆకు ప‌చ్చ‌ని న‌గ‌రంగా తీర్చుదిద్దుతున్నామ‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్, మేనేజింగ్ డ

గ్రీన్ సిటీగా రాజ‌ధాని అమ‌రావ‌తి
ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు స్వ‌ప్న‌మైన ప్ర‌జా రాజ‌ధాని అమ‌రావ‌తిని ఆకు ప‌చ్చ‌ని న‌గ‌రంగా తీర్చుదిద్దుతున్నామ‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డి.ల‌క్ష్మీపార్థసార‌థి అన్నారు. రాజ‌ధానిలో 30 శాతం అధిక ఆక్సిజ‌న్ అందించే చెట్ల‌తో సుంద‌రీక‌రిస్తున్నామ‌ని, నిష్ణాతులైన అధికారుల‌ను నియ‌మించి ర‌హ‌దార్లు, పార్కుల‌ను ఆక‌ర్ష‌ణీయ‌మైన చెట్ల‌తో బ్యూటిఫికేష‌న్ చేస్తున్నామ‌ని చెప్పారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆధ్వ‌ర్యంలో సిద్ధార్థా హోట‌ల్ మేనేజ్‌మెంట్ ప్రాంగ‌ణంలో ఫ‌ల‌, పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌లో అమ‌రావ‌తి న‌గ‌రంలో ఏడీసీ చేప‌డుతున్న వివిధ గ్రీన్ ప్రాజెక్టుల‌ను సంద‌ర్శ‌కుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. శుక్ర‌వారం ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏడీసీ స్టాల్‌ను ఆమె ప్రారంభించారు. ఇందులో అమ‌రావ‌తిలో నిర్మాణం జ‌రుపుకుంటున్న ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, ర‌హ‌దార్ల వ్య‌వ‌స్థ‌, పార్కులు, న‌ర్స‌రీలు, వాగుల వెంబడి చేప‌డుతున్న‌ సుందరీక‌ర‌ణల ఛాయాచిత్రాల‌ను ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచామ‌న్నారు.
Andhra Pradesh Capital
Amaravati Development
Green City Initiative
Urban Beautification
ADC Projects
Environmental Development
Green Projects
Urban Parks
Roadside Plantations
Sustainable City
ఆర్‌పి సొసైటీ
ప్రజల అవగాహన
ఇకో ఫ్రెండ్లీ నగరం
నగర ప్రణాళిక
చంద్రబాబు నాయుడు దృష్టి
Scroll for the next article