News7th Jun 05:34 PMSunil Byrisetty1 min read
మహిళలపై వ్యాఖ్యలపై డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
అమరావతి మీద సాక్షి ఛానల్‌లో అపహాస్య, అవమానకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. అమరావతిని వేశ్యల
అమరావతి మీద సాక్షి ఛానల్‌లో అపహాస్య, అవమానకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. అమరావతిని వేశ్యల రాజధాని అన్న ఆరోపణలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కృష్ణం రాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయాలన్నారు. టీవీలో ఈ తరహా తీవ్ర విమర్శలు.. మానవతా విలువలు, జర్నలిజం ప్రమాణాలు తిలోదకాలు ఇవ్వటమే అవుతుందన్నారు. IPC సెక్షన్లు 294, 354A, 500, 504, 505(2), 509 ప్రకారం చర్యలు కోరుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. టెలికాస్ట్ ఫుటేజ్ ఆధారంగా చానల్‌పైన, యాంకర్‌తోపాటు ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు పైన చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.