News30th Apr 12:11 PMSunil Byrisetty1 min read

అది రాకపోతే.. అమరావతి మున్సిపాలిటీయే!

అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతే రాజధాని అమరావతి కేవలం ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్

అది రాకపోతే.. అమరావతి మున్సిపాలిటీయే!
అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతే రాజధాని అమరావతి కేవలం ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధికి రెండో విడత భూసేకరణ తప్పనిసరి అన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ వస్తేనే అమరావతి అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుందని.. లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. రాజధాని అభివృద్ధి సీఎం చంద్రబాబు నిర్ణయానికి ఏకగ్రీవంగా అంగీకరిస్తామని అమరావతి రైతులు అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా పార్లమెంట్‍లో చట్టం చేయాలని రైతులు కోరారు. ఈ మేరకు రైతుల ప్రతిపాదనకు ఒప్పుకున్న చంద్రబాబు కేంద్రంతో మాట్లాడతానన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Amaravati
International Airport
రెండో విడత భూసేకరణ
అమరావతి అంతర్జాతీయ నగరం
రాజధానిగా పార్లమెంట్‍లో చట్టం
Scroll for the next article