News23rd Jun 04:04 PMSunil Byrisetty1 min read

రాజ‌ధానిలో మ‌రో ఆరుసంస్థ‌ల‌కు భూకేటాయింపులు

గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం,మూడు రాజ‌ధానుల దెబ్బ‌కు అమ‌రావ‌తి అంటే కొన్ని సంస్థ‌లు భ‌య‌ప‌డి వెళ్లిపోయాయ‌న్నారు మంత్రి నారాయ‌ణ. గ‌తంలో భూకేటాయింపులు చేసిన సంస్థ‌లు ఇప్పుడు స‌రిగా స్పందిం

రాజ‌ధానిలో మ‌రో ఆరుసంస్థ‌ల‌కు భూకేటాయింపులు
గ‌త ప్ర‌భుత్వ నిర్వాకం,మూడు రాజ‌ధానుల దెబ్బ‌కు అమ‌రావ‌తి అంటే కొన్ని సంస్థ‌లు భ‌య‌ప‌డి వెళ్లిపోయాయ‌న్నారు మంత్రి నారాయ‌ణ. గ‌తంలో భూకేటాయింపులు చేసిన సంస్థ‌లు ఇప్పుడు స‌రిగా స్పందించ‌డం లేద‌న్నారు. తాజాగా అమ‌రావ‌తిలో కొత్త‌గా 10 సంస్థ‌ల‌కు భూకేటాయింపులు చేస్తూ మంత్రివ‌ర్గ ఉపసంఘం నిర్ణ‌యం తీసుకుందన్నారు. మొత్తం నాలుగు సంస్థ‌ల‌కు గ‌తంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయ‌గా, కొత్త‌గా ఆరు సంస్థ‌ల‌కు స‌బ్ క‌మిటీ కేటాయింపులు చేసింది. అయితే గ‌తంలో కేటాయించిన రెండు సంస్థ‌ల‌కు భూముల కేటాయింపులు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. స‌చివాల‌యంలో జ‌రిగిన భూకేటాయింపుల మంత్రివ‌ర్గ ఉప‌సంఘం సమావేశానికి మంత్రులు నారాయ‌ణ‌, టీజీ భ‌ర‌త్ హాజ‌ర‌య్యారు. మంత్రులు ప‌య్యావుల కేశవ్, దుర్గేష్ ఆన్ లైన్ ద్వారా హాజ‌ర‌య్యారు. స‌మావేశం ముగిసిన త‌ర్వాత మంత్రి నారాయ‌ణ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు.
Andhra Pradesh news
Amaravati development
minister narayana
Amaravati land allotted
మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
అమరావతిలో కొత్తగా 6 సంస్థలకు భూములు
Scroll for the next article