News30th Aug 01:17 PMSunil Byrisetty1 min read

అమరావతిలో కేటాయింపులపై విమర్శలు

రాజధాని అమరావతి పరిధిలో కోట్ల రూపాయల లబ్దిపొందుతున్న యూనివర్శిటీలు స్థానికుల గురించి పట్టించుకోవడం లేదు. దీనిపై రైతుల్లో క్రమంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని పరిధిలో విట్, ఎస్ఆర్

అమరావతిలో కేటాయింపులపై విమర్శలు
రాజధాని అమరావతి పరిధిలో కోట్ల రూపాయల లబ్దిపొందుతున్న యూనివర్శిటీలు స్థానికుల గురించి పట్టించుకోవడం లేదు. దీనిపై రైతుల్లో క్రమంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని పరిధిలో విట్, ఎస్ఆర్ఎం, అమృత వంటి యూనివర్శిటీలకు 200 ఎకరాల చొప్పున భూమి కేటాయించారు. వాస్తవంగా ప్రభుత్వం లెక్కల ప్రకారం భూమి విలువ భవిష్యత్లో ఎకరం రూ.100 కోట్లకు చేరే అవకాశం ఉంది. అయినా పెట్టుబడి అంచనాల రీత్యా ఎకరం కనీసం రూ.10(విద్యాసంస్థలుగనుక) కోట్లు పెట్టాల్సి ఉంది. కానీ ఆయా సంస్థలు అవేమీ చేయలేదు. పైగా పూర్తిస్థాయి ఫీజులతో కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని పరిధిలో విద్యార్థులకు కనీస ప్రవేశంలేదు. ఇటీవల భూములు కేటాయించిన సమయంలోనైనా సిఆర్డిఎ పరిధిలో విద్యార్థులకు, అందులోనూ రాజధాని పరిధిలో భూములు సమీకరణకు ఇచ్చేసిన వారి కుటుంబాల్లో పిల్లలకు ప్రవేశాల్లో ప్రత్యేకత ఇవ్వాలని, ఫీజులు రాయితీ ఇవ్వాలనే డిమాండును ముందుకు తెచ్చారు. అయినా ఆయా విద్యాసంస్థలు పరిగణనలోకి తీసుకోలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Andhra Pradesh news
Amaravati
Capital Region
Universities
VIT
SRM
Amrita
Farmers
Protests
Land Allocation
Education
CRDA
రాజధాని రైతులు
భూమి సమీకరణ
Scroll for the next article