News10th Oct 11:31 AMSunil Byrisetty1 min read

మాస్టర్ ప్లానుతో గ్రామాల విలీనం

రాజధాని అమరావతి పరిధిలోని ఆర్1 జోన్ కింద ఉన్న గ్రామాలను మాస్టర్ ప్లానుకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న 24 రెవెన్యూ గ్రామాల్లోని రోడ్లను కూడా ప్లానులో ఉన్న ర

మాస్టర్ ప్లానుతో గ్రామాల విలీనం
రాజధాని అమరావతి పరిధిలోని ఆర్1 జోన్ కింద ఉన్న గ్రామాలను మాస్టర్ ప్లానుకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న 24 రెవెన్యూ గ్రామాల్లోని రోడ్లను కూడా ప్లానులో ఉన్న రోడ్లతో కలపనున్నారు. ఉండవల్లి, పెనుమాక, నవులూరు, నిడమర్రు రెవెన్యూ గ్రామాలు ఇప్పటికే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నందున రోడ్ల అనుసంధాన ప్లాను నుండి వాటిని మినహాయించారు. ఇంటిగ్రేషన్ ప్లానులో చేర్చారు. మాస్టర్ ప్లాను తయారుచేసే సమయంలో మేజర్ ఆర్టీరియల్, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లకు నిర్దేశించిన ప్రాంతంలోనే ప్రవేశం ఉండేలా ప్లాను రూపొందించారు. ఈ సమయంలో గ్రామాల నుండి వెళ్లే కనెక్టివిటీని పరిగణనలోకి తీసుకోలేదు. ఆర్1 జోన్ గా పరిగణించి ప్లాను నుండి మినహాయించారు. మాస్టర్ ప్లాను రోడ్లను నిర్మిస్తున్న సమయంలో వెంకటపాలెంతోపాటు మరికొన్ని గ్రామాల్లో కనెక్టివిటీ సమస్య ఏర్పడింది. అలాగే వెలగపూడిలో ఇప్పుడున్న విజయవాడ - అమరావతి రహదారి మధ్యలో పాలవాగు వస్తుంది. మల్కాపురం తరువాత ఈ9 రహదారి వెళుతుంది. అక్కడ వంతెన నిర్మించడమా లేక ప్రత్యామ్నాయ ప్రధాన రహదారికి అనుసంధానం చేయడమా అనేది సమస్యగా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత గ్రామాల్లో ఉండే రోడ్లను మాస్టర్ ప్లాను ప్రకారం నిర్మిస్తున్న రోడ్లకు కలపనున్నారు. ఎక్కడెక్కడ కలపాలి అనే అంశంపై సమగ్ర ప్లాను కూడా రూపొందించారు. అభిప్రాయ సేకరణ అనంతరం ఖరారు చేయనున్నారు. ఈ మేరకు సిఆర్డిఎ చట్టంలోని సెక్షన్ 39(1) ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.
Scroll for the next article