News5th Aug 10:33 AMSunil Byrisetty1 min read

గుంటూరు - విజయవాడతో అమరావతి మెగా సిటీ

గుంటూరు, విజయవాడతో కలిపి అమరావతి మెగా సిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సిఆర్డిఏ అథారిటీ ప్రాథమిక ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీనిలో భాగం

గుంటూరు - విజయవాడతో అమరావతి మెగా సిటీ
గుంటూరు, విజయవాడతో కలిపి అమరావతి మెగా సిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సిఆర్డిఏ అథారిటీ ప్రాథమిక ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీనిలో భాగంగానే అమరావతి విజయవాడను కలిపేందుకు వీలుగా కృష్ణానదిపై మరిన్ని వంతెనలు నిర్మించేందుకు అవసరమైన నివేదిక తయారు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీఆర్డీఏ అథారిటీ 64వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో రోప్ వే ప్రాజెక్టు పిపిపి పద్ధతిలో చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. విజయవాడలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, దుర్గా టెంపులు, పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్, అక్కడి నుండి వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేలా రోప్ వే నిర్మించనున్నారు.
Andhra Pradesh
Amaravati
Guntur
Vijayawada
Mega City
CRDA
కృష్ణా నది
రోప్‌వే ప్రాజెక్టు
మౌలిక వసతులు
పట్టణాభివృద్ధి
Scroll for the next article