News12th Sep 11:06 AMSunil Byrisetty1 min read
రూ.25వేల కోట్లతో పది వరుసల అమరావతి ORR
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం భారీ భూసేకరణ, పెద్ద ఎత్తున వ్యయం జరగనుంది. 190 కిలోమీటర్ల పొడవుతో, 140 మీటర్ల వెడల్పుతో దేశంలోనే తొలిసారి ఇంత పెద్ద స్థాయిలో భూసేకరణ చేపట్టనున్నారు. ఆం
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం భారీ భూసేకరణ, పెద్ద ఎత్తున వ్యయం జరగనుంది.
190 కిలోమీటర్ల పొడవుతో, 140 మీటర్ల వెడల్పుతో దేశంలోనే తొలిసారి ఇంత పెద్ద స్థాయిలో భూసేకరణ చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకుని ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్టు వ్యయం తాజాగా భారీగా పెరిగింది. 190 కిలోమీటర్ల పొడవుతో, మొత్తం 10 వరుసల రహదారిగా నిర్మించాలనే ప్రతిపాదనతో ప్రాజెక్టు ఖర్చు సుమారు రూ.25 వేల కోట్లకు చేరుకుంది. ఇందులో ఆరు వరుసలు ప్రధాన రహదారి కోసం, ఇరువైపులా రెండు వరుసలు చొప్పున సర్వీస్ రోడ్ల నిర్మాణం ఉంటాయి. ప్రారంభంలో ఈ రింగ్ రోడ్ 70 మీటర్ల వెడల్పుతో ఉండాలని మోర్త్ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టు ఖర్చు రూ.16,310 కోట్లుగా నిర్ణయించారు.