News27th Jan 02:54 PMSunil Byrisetty1 min read

రైతుల కోసం రెండోదశ పూలింగులో మార్పులు

అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా చేపడుతున్న రెండోదశ పూలింగులో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక్కడ రైతులకు ఇచ్చే ప్లాట్లను తొలిదశలో ఇచ్చినట్లు వాణిజ్యం లేదా నివ

రైతుల కోసం రెండోదశ పూలింగులో మార్పులు
అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా చేపడుతున్న రెండోదశ పూలింగులో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక్కడ రైతులకు ఇచ్చే ప్లాట్లను తొలిదశలో ఇచ్చినట్లు వాణిజ్యం లేదా నివాసం పద్ధతిలో కాకుండా మిక్స్డ్ యూజ్(సమ్మిళిత) పద్ధతిలో ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్లాట్ల కేటాయింపు జరపాలని నిర్ణయించారు. మాస్టర్ ప్లాను కోసం ఏర్పాటు చేసే కన్సల్టెంట్లకు ప్లాట్ల ఏర్పాటుతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చేసే ప్లాను రూపొందించాలని ప్రతిపాదించారు. రిటర్నబుల్ ప్లాట్ల ఏర్పాటులో రైతులకు ఇచ్చే భూమికి విలువ పెరిగేలా చూడాలని సూచించారు. తొలిదశలో ఇచ్చిన ప్లాట్లలో నివాసం, వాణిజ్యం వేర్వేరుగా ఇవ్వడంతో ఎక్కువ ప్లాట్లు వేయడం, భూమి ఒకే పార్సిల్గా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా మారిపోయింది. దీంతో కేటాయింపులు చేయాలంటే ఇబ్బందిగా మారింది. రెండోదశలో అటువంటి పరిస్థితి లేకుండా ల్యాండ్ పార్సిల్ను ఒకేచోట ఉండేలా చూడాలని ఆలోచన చేస్తున్నారు.
Andhra Pradesh Government
Amaravati Capital
Land Pooling Scheme
Phase 2 Land Pooling
Farmers Welfare
Mixed Use Plots
అమరావతి విస్తరణ
రిటర్నబుల్ ప్లాట్లు
మాస్టర్ ప్లాన్
క్యాపిటల్ డెవలప్‌మెంట్
Scroll for the next article