News28th Jun 04:48 PMSunil Byrisetty1 min read
క్వాంటంతో కొత్త చరిత్ర!
రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ పేరు మార్మోగుతోంది. క్వాంటం టెక్నాలజీ రాబోతోందంటూ ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐబీఎం టెక్నాలజీస్, ఎల్
రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ పేరు మార్మోగుతోంది. క్వాంటం టెక్నాలజీ రాబోతోందంటూ ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐబీఎం టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ తదితర సంస్థలు ఇప్పుడు క్వాంటం టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నాయి. క్వాంటం టెక్నాలజీ అంటే ఏదో సాఫ్ట్ వేర్, సామాన్యులకు సంబంధం లేనిది అనుకోలేము. మనందరి దైనందిన జీవితంలో క్వాంటం అనేది ఎంతో ప్రభావం చూపిస్తుంది. రాబోయే రోజుల్లో మానవుడికి సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో క్వాంటం టెక్నాలజీ వినియోగం ఉండనుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాంటం టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.