News25th Nov 11:30 AMSunil Byrisetty1 min read
అమరావతి క్వాంటం వ్యాలీ భవన నమూనాలివే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణంపై దృష్టి సారించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన భవన నమూనాలను అధికారులు సమీక్షించారు. అమరావతిని టెక్నాలజీ ఆధారిత పరిశ్రమల కేంద
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణంపై దృష్టి సారించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన భవన నమూనాలను అధికారులు సమీక్షించారు. అమరావతిని టెక్నాలజీ ఆధారిత పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రాజెక్ట్ పొందుపరుస్తోంది. లింగాయపాలెం సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని 50 ఎకరాల్లో నిర్మాణం జరగనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రాథమిక కార్యకలాపాలు ప్రారంభం కానుంది. మౌలిక వసతుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాన భవనం చుట్టూ 8 ఆధునిక టవర్లు నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 80 లక్షల చదరపు అడుగుల్లో ఉండనుంది. పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లు, టెక్ కంపెనీలకు ప్రత్యేక స్థలాలు కేటాయించారు. అమరావతి పేరుకి సంకేతంగా ప్రధాన భవనం "A" ఆకారంలో డిజైన్ ఉండనుంది.