Politics14th Mar 09:59 AMSunil Byrisetty1 min read
అమరావతి 2.0 పనులకు సిద్ధం
అమరావతి రాజధాని 2.0 పనులకు రంగం సిద్ధమైంది. పునర్నిర్మాణ పనుల్లో మరో అడుగు ముందుకు పడింది. గత ప్రభుత్వంలో భవనాలు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఆ పనులను పునఃప్రారంభిం
అమరావతి రాజధాని 2.0 పనులకు రంగం సిద్ధమైంది. పునర్నిర్మాణ పనుల్లో మరో అడుగు ముందుకు పడింది.
గత ప్రభుత్వంలో భవనాలు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఆ పనులను పునఃప్రారంభించి పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఆర్డీయే టెండర్లు ఖరారు చేసింది. టెండర్లలో అర్హత సాధించి ఎల్1గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వటం ప్రారంభించింది.
ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయా సంస్థలు పనులు మొదలుపెట్టాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఐఏఎస్ టవర్లను పూర్తిచేసే కాంట్రాక్టు ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది.
మంత్రులు, జడ్జిల బంగళాలకు పిలిచిన టెండర్లలో బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ ఎల్1గా నిలిచింది.
కార్యదర్శుల బంగళాలను పూర్తి చేసే కాంట్రాక్టును కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధికి పిలిచిన టెండర్లను బీఎస్ఆర్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, మేఘా, బీఎస్ఆర్, ఎల్అండ్ టీ, ఎన్సీసీ సంస్థలు దక్కించుకున్నాయి. ఇక హ్యాపీనెస్ట్ కాంట్రాక్టు ఎన్సీసీకి దక్కింది.
రాజధాని ప్రాంతంలో మిగిలిన రహదారి పనులకు సంబంధించిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్స్, వాటర్ సప్లై నెట్వర్క్, సీవరేజి నెట్వర్క్, యుటిలిటీ డక్ట్స్, రీ యూజ్ వాటర్ లైన్స్, నడకదారులు, సైకిల్ ట్రాక్స్, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ వంటి పనులకు రూ.4313.78 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. వీటికోసం 41 కాంట్రాక్టు సంస్థల నుంచి బిడ్లు పడ్డాయి. ఆయా పనులను ఎంవీఆర్బఎల్, ఎన్సీసీ, బీఎస్ఆర్, ఆర్వీఆర్, మేఘా సంస్థలు దక్కించుకున్నాయి.