News5th Aug 02:29 PMSunil Byrisetty1 min read
అమరావతి జీవనాడి ప్రారంభం 13న!
రాజధాని అమరావతికి జీవనాడిగా భావించే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 13న సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీనిని అధికారికంగా ప్రారంభించేందుకు సీఆర్డీయే
రాజధాని అమరావతికి జీవనాడిగా భావించే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 13న సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీనిని అధికారికంగా ప్రారంభించేందుకు సీఆర్డీయే సిద్ధమవుతోంది. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బహుళ అంతస్తుల నివాస సముదాయాలను కూడా సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించనున్నారు. ఈ భవనాలు అత్యాధునిక వసతులతో, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మితమయ్యాయి. జాతీయ రహదారులతో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులను అనుసంధానించే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి రాజధానికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. దీంతో రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు పడినట్లవుతుంది.