Sports13th Oct 01:39 PMSunil Byrisetty1 min read

పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే పోటీలు

అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అని

పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే పోటీలు
అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ..ఐదు రోజుల పాటు రెండు ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోలీసుల క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గత ఏడాది ఈ పోటీలు ప్రారంభించామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సారిగా పోటీలు జరగటం శుభ పరిణామమన్నారు. పవర్ లిఫ్టింగ్‌తో పాటు, యోగా పోటీలను నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యోగాలో రాష్ట్రం గిన్నిస్ బుక్ సాధించిన సంగతి తెలిసిందే అని అన్నారు. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి 1011 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారని మంత్రి అనిత పేర్కొన్నారు.
Andhra Pradesh Police
Sports City
Police Sports
Powerlifting Championship
All India Police Meet
APSP Battalion
Vangalapudi Anitha
DGP Harish Kumar Gupta
Sports Spirit
Yoga Competition
టీమ్ ఆంధ్ర
పోలీస్ క్రీడాకారులు
జాతీయ స్థాయి పోటీలు
Scroll for the next article