News2nd May 05:01 PMSunil Byrisetty1 min read
రైతులు భూములే కాదు..రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు!
అమరావతి రాజధాని కోసం రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదుని, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారుని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి పున:ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైత
అమరావతి రాజధాని కోసం రైతులు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదుని, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారుని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతి పున:ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని నలిగిపోయారన్నారు.
తమ కన్నీళ్లు తుడిచేవారెవరని అప్పట్లో రైతులు నన్ను అడిగారని గుర్తు చేశారు.
అమరావతి ఐదు కోట్ల మందికి సంబంధించిన హబ్ అని, గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టిందని చెప్పారు.
దేశమే తన కుటుంబంగా మోదీ భావిస్తున్నారని తెలిపారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారని చెప్పారు.
అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని పవన్ కల్యాణ్ వివరించారు.