News12th Sep 11:17 AMSunil Byrisetty1 min read
అమరావతి కేంద్రంగా అర్బన్ జిల్లా!
రాజధాని అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పక్కన పెట్టి గత
రాజధాని అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పక్కన పెట్టి గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అప్పటి నుంచి అనేక వివాదాలు, అసంతృప్తులు వెల్లువెత్తాయి. ప్రజల అభిప్రాయాలను సక్రమంగా సేకరించకుండానే తీసుకున్న ఆ నిర్ణయం గందరగోళానికి దారి తీసిందని విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితిని సరిచేయడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది.జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ప్రజల వినతులు స్వీకరించడం ప్రారంభించింది. జిల్లాల కలెక్టర్లు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అమరావతి అర్బన్ జిల్లా తెరపైకి వచ్చింది.