News25th Aug 10:43 AMSunil Byrisetty1 min read

అమరావతిలో ఏడు ఎనర్జీ స్టేషన్లు

రాజధాని అమరావతిలో విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏడుచోట్ల విద్యుత్ వాహన ఛార్జింగు స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. దీనికోసం టెండర్లను ఆహ్వానించింది. స్టేషన్

అమరావతిలో ఏడు ఎనర్జీ స్టేషన్లు
రాజధాని అమరావతిలో విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏడుచోట్ల విద్యుత్ వాహన ఛార్జింగు స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. దీనికోసం టెండర్లను ఆహ్వానించింది. స్టేషన్ల ఏర్పాటుకు 18.25 ఎకరాలను కేటాయించింది. అనంతవరంలో ఒకటి, కురగల్లులో మూడు, నేలపాడులో రెండు, వెలగపూడిలో ఒకటి ఏర్పాటు చేయనున్నారు. అమరావతి రోడ్డు నెట్వర్క్లోని పౌర సౌకర్యాల ఏర్పాటులో భాగంగా సమీకృత, బహుళ-ఉపయోగ 'ఎనర్జీ స్టేషన్ల'ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు టెండర్లో పేర్కొంది. భవిష్యత్లో పెట్రోల్, డీజిల్, సిఎన్జీ, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్, రిటైల్, ఫుడ్ అండ్ బెవరేజ్, వెల్నెస్ వంటి సదుపాయాలూ కల్పించాలని అధికారులు నిర్ణయించారు. సెక్రటేరియట్, లెజిస్లేచర్, జ్యుడీషియరీ అనుబంధ ప్రభుత్వ కార్యాలయాల వాహనాలకు 24 గంటలూ అందుబాటులో ఉండాలని పొందుపరిచారు. జాతీయ విద్యుత్ వాహన మొబిలిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసే ఈ కేంద్రాలకు సంబంధించి అమరావతి ప్రయోగాత్మక కేంద్రంగా ఉండాలని నిర్ణయించినట్లు టెండర్లో పేర్కొన్నారు.
Andhra Pradesh
Amaravati
Energy Stations
EV Charging
Electric Vehicles
Amaravati Roads
Kuragallu
Nelapadu
ఈవీ మొబిలిటీ
ఛార్జింగ్ స్టేషన్లు
రాజధాని అమరావతి
ఎలక్ట్రిక్ వెహికల్స్
Scroll for the next article