News19th Aug 09:37 AMSunil Byrisetty1 min read

అమ‌రావ‌తి అదరహో అనేలా డిజైన్లు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చేపట్టే ప్రతి నిర్మాణం డిజైన్ అదిరిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజధానిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు సాదా సీదా

అమ‌రావ‌తి అదరహో అనేలా డిజైన్లు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చేపట్టే ప్రతి నిర్మాణం డిజైన్ అదిరిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజధానిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు సాదా సీదా డిజైన్లు కాదు.. అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. సీఎం అధ్యక్షతన జరిగిన 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీల‌క‌మైన‌ 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో చేపట్టే వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు స్పెష‌ల్ పర్స‌స్ వెహిక‌ల్ ఏర్పాటుకు సీఆర్డీఏ అథారిటీ తన ఆమోదాన్ని తెలిపింది. రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్ ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, రోప్ వే లాంటి ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు చేయ‌నున్నారు. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్, జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్కు ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్(భూ సమీక‌ర‌ణ‌) కింద భూ సమీకరణ చేయాల‌ని చంద్ర‌బాబు నిర్దేశించారు.
Andhra Pradesh
Amaravati capital city
Chandrababu Naidu
CRDA meeting
Iconic bridge Krishna river
Kuchipudi-inspired designs
Greenfield airport Amaravati
NTR statue
స్పోర్ట్స్ సిటీ అమరావతి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
Scroll for the next article