News4th Oct 11:12 AMSunil Byrisetty1 min read
వరల్డ్ పాన్ ఐఐటీ కౌన్సిల్‌కు వేదికగా అమరావతి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐఐటియన్ల మేధస్సు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధి కోసం వారంతా అనుసంధానమై నెట్వర్క్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐఐటియన్ల మేధస్సు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధి కోసం వారంతా అనుసంధానమై నెట్వర్క్ గా ఏర్పడాలని ఆయన సూచించారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026లో పాల్గొన్న ముఖ్యమంత్రి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ నాలెడ్జ్, డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడ్డాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పాటు, డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్ల పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యు-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటం కంప్యూటర్లను ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్ రూపొందించిన ఈ కంప్యూటర్లు మినీ టెస్టింగ్ క్వాంటం కంప్యూటర్ ల్యాబ్‌లుగా ఉపయోగ పడనున్నాయి. 4 కెల్విన్ ప్రాసెసర్ సృష్టిని కూడా సీఎం ఆవిష్కరించారు.