News15th Aug 09:34 AMSunil Byrisetty1 min read
ఇన్నర్ రింగుకు అమరావతి రోడ్లు
రాజధానిలో నిర్మిస్తున్న ట్రంకు రోడ్లను ఇంటర్నల్ రింగు రోడ్డు(ఐఆర్ఆర్)కు అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.3,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీని
రాజధానిలో నిర్మిస్తున్న ట్రంకు రోడ్లను ఇంటర్నల్ రింగు రోడ్డు(ఐఆర్ఆర్)కు అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.3,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నల్ రింగు రోడ్డుకు అవసరమైన భూమి కోసం ఇప్పటికే సిఆర్డిఏ గ్రామ సభలు నిర్వహించింది. భూ సమీకరణ పద్ధతిలో తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రింగురోడ్డును కంతేరు సమీపంలో నుండి వైకుంఠపురం వరకూ నిర్మిస్తున్నారు. రెండోదశ అభివృద్ధిలో భాగంగా తొలిదశలో ఉన్న ట్రంక్ లైన్లను కలపాలని గతంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. ముఖ్యంగా తూర్పు పడమరలకు వేస్తున్న ఈ సిరీస్ రోడ్డు 2,7,8,13, ఉత్తర దక్షిణం వరకూ వేస్తున్న ఎన్ సిరీస్ రోడ్లలో 10, 12, 15, 17 రోడ్లను విస్తరించడంతో పాటు రింగురోడ్డుకు అనుసంధానం చేయనున్నారు.