News9th Jun 01:53 PMSunil Byrisetty1 min read
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. నిరసన ర్యాలీ
టీవీ డిబేట్‌లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన VVR కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, ఇలా మాట్లాడించిన సాక్షి టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపా
టీవీ డిబేట్‌లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన VVR కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, ఇలా మాట్లాడించిన సాక్షి టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర మాట్లాడుతూ.. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చి 11 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన జగన్ లో ఇప్పటికీ అహంకారం తగ్గలేదన్నారు. మహిళలను కించపరిచే విధంగా చేయించిన అసభ్యకర వాఖ్యలను సభ్యసమాజం ఖండిస్తుందన్నారు. తనకు అధికారం ఇవ్వలేదన్న అక్కసుతో తన ఛానెల్లో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వాఖ్యలను చేయించారని మండిపడ్డారు.