News11th Nov 12:12 PMSunil Byrisetty1 min read
రాత్రి వేళల్లోనూ అమరావతి పనులు!
అమరావతి రాజధాని పనులు వేగవంతమయ్యాయి. పనులు దక్కించుకున్న సంస్థలు పెద్ద ఎత్తున మ్యాన్ పవర్, విదేశీ యంత్రాలను తీసుకు వచ్చి చేయిస్తున్నారు. పనులు ఇరవై నాలుగు గంటలూ జరిగేలా షిఫ్టుల వార
అమరావతి రాజధాని పనులు వేగవంతమయ్యాయి. పనులు దక్కించుకున్న సంస్థలు పెద్ద ఎత్తున మ్యాన్ పవర్, విదేశీ యంత్రాలను తీసుకు వచ్చి చేయిస్తున్నారు. పనులు ఇరవై నాలుగు గంటలూ జరిగేలా షిఫ్టుల వారీగా పనులు చేస్తున్నారు . దీంతో అమరావతి మెత్తం రాత్రి సమయంలో కూడా సందడిగా కనిపిస్తోంది. అందుకోసం ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసి మరీ పనుల్లో స్పీడ్ పెంచారు. 2019 నాటికి 70 శాతం పూర్తయిన భవనాలను వచ్చే మార్చికల్లా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్జిలు, ఆఫీసర్ల బంగాళాల్లో ఇంటీరియర్ వర్కులు జరుగుతున్నాయి. గ్రూప్ డీ ఆఫీసర్ల క్వార్టర్స్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అలాగే ఐకానిక్ టవర్ల నిర్మాణం కూడా జోరందుకుంది. అలాగే అసెంబ్లీ, హైకోర్టు భవనాల శాశ్వత నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.