News12th Jul 02:01 PMSunil Byrisetty1 min read

గ్రీన్ అమ‌రావ‌తే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి

ప్ర‌జా రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌చ్చ‌ని తోర‌ణంలా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా గార్డెన‌ర్లు ప‌నిచేయాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ

గ్రీన్ అమ‌రావ‌తే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి
ప్ర‌జా రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌చ్చ‌ని తోర‌ణంలా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా గార్డెన‌ర్లు ప‌నిచేయాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు సూచించారు. అమ‌రావ‌తి గ్రీనింగ్ ప్రాజెక్టుల్లో ప‌నిచేయడానికి 29 గ్రామాల నుంచి ఎంపిక చేయ‌బ‌డిన మ‌హిళ‌ల‌కు ఏపీ జీబీసీ ఆధ్వ‌ర్యంలో ప‌చ్చ‌ద‌నం పెంప‌కంలో 21 రోజుల పాటు శిక్ష‌ణ ఇచ్చి స‌చివాల‌య ప్రాంగ‌ణంలోని ఏపీ సీఆర్డీఏ న‌ర్స‌రీలో స‌ర్టిఫికెట్లు అంద‌జేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ రాజ‌ధాని గ్రీన్‌ అమ‌రావ‌తిగా తీర్చిద్ద‌డానికి మూడు ల‌క్ష‌ల మొక్క‌లు అవ‌స‌రం అని చెప్పారు. శిక్ష‌ణ పూర్తిచేసుకున్న మీరంతా మీ గ్రామాల‌లో చెట్ల‌ను గుర్తించి అధికారుల‌కు తెలియ‌జేల‌న్నారు. ముఖ్య‌మ‌త్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా వినూత్న జాతుల వృక్ష‌జాలాన్ని అమ‌రావ‌తి న‌గ‌రంలో పెంచే విధంగా ప్ర‌తి గార్డెన‌ర్ కృషి చేయాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా నూత‌న గార్డెన‌ర్లకు పుప్ష‌గుచ్ఛాల‌ను అంద‌జేసి, అనంత‌రం సీఎండీ వారి చేతుల మీదుగా శిక్ష‌ణ పూర్తిచేసుకున్న గార్డెన‌ర్ల‌కు స‌ర్టిఫికెట్లు అంద‌జేశారు.
Andhra Pradesh news
amaravati
D. Lakshmi Parthasarathy
capital Amaravati a green oasis
three lakh plants
gardeners
గ్రీన్ అమ‌రావ‌తే ల‌క్ష్యం
Scroll for the next article