News13th Aug 12:13 PMSunil Byrisetty1 min read
తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ భూమి పూజ
తుళ్లూరు గ్రామంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు చేసిన ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ క్యాన్సర్ హా
తుళ్లూరు గ్రామంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు చేసిన ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ క్యాన్సర్ హాస్పటల్ అందుబాటులోకి రావటం వల్ల క్యాన్సర్ బాధితులకు ఎంతో ఉపయోగంగా వుంటుంది. బసవతారకం హాస్పటల్ ను 21 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హైదరాబాద్ వెళ్లే పని లేకుండా ఇక్కడే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానుంది. తొలి దశలో రూ.750 కోట్ల రూపాయలతో 500 పడకల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుతో ఈ హాస్పటల్ నిర్మాణం జరగనుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నందుకు ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.