News12th Nov 10:03 AMSunil Byrisetty1 min read

రెండోదశ మాస్టర్‌ ప్లాన్ సిద్ధం

రాజధాని అమరావతి రెండోదశ భూ సమీకరణకు సంబంధించి మాస్టర్‌ ‌ప్లాను సిద్ధమైంది. సింగపూర్‌ ‌ప్రతినిధులు పూలింగు ప్రాంతంలో రెండు దశలుగా పర్యటించిన సంగతి తెలిసిందే. అలాగే సిఆర్డిఏ కార్యాలయ

రెండోదశ మాస్టర్‌ ప్లాన్ సిద్ధం
రాజధాని అమరావతి రెండోదశ భూ సమీకరణకు సంబంధించి మాస్టర్‌ ‌ప్లాను సిద్ధమైంది. సింగపూర్‌ ‌ప్రతినిధులు పూలింగు ప్రాంతంలో రెండు దశలుగా పర్యటించిన సంగతి తెలిసిందే. అలాగే సిఆర్డిఏ కార్యాలయంలో సింగపూర్–ఆంధ్రప్రదేశ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ మూడో సమావేశం జరిగింది. దీనికి మంత్రి నారా లోకేష్‌ ‌కూడా హాజరయ్యారు. అమరావతిని ఆధునిక, సమగ్ర, సుస్థిర రాజధాని నగరంగా అభివృద్ధి చేయాలనే అంశంపై గతంలో పెట్టుకున్న లక్ష్యాలపై, ఇప్పటివరకు సాధించిన పురోగతి, భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా గతంలో ఉన్న మాస్టర్‌ ‌ప్లాను అమలు అంశంతోపాటు కొత్తగా రూపొందించనున్న ప్లానుపై లోకేష్ సింగపూర్‌ ‌ప్రతినిధులను అడిగి వివరాలు తీసుకున్నారు. సింగపూర్‌ ‌ప్రతినిధులు కూడా రెండోదశ భూములకు అక్కడ ప్లానుకు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించారు. కొత్తగా వేస్తున్న ఇన్నర్‌ ‌రింగురోడ్డు, రైల్వేలైనుకు తొలిదశ మాస్టర్‌ ‌ప్లానులో ఉన్న రోడ్లను అనుసంధానం చేయడంపై ప్రాథమిక ప్లాను రూపొందించారు. దీంతో పాటు ఐటి హబ్‌, ఎయిర్‌పోర్టు తదితర అంశాలనూ ఇందులో ప్రస్తావించనున్నారు.
Scroll for the next article