News11th Aug 04:51 PMSunil Byrisetty1 min read

స‌ర్వాంగ సుంద‌రంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు

రాజ‌ధాని అమ‌రావ‌తి ప్ర‌ధాన మార్గ‌మైన సీడ్ యాక్సెస్‌రోడ్డును ప్రారంభోత్స‌వానికి అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేస్తోంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్

స‌ర్వాంగ సుంద‌రంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు
రాజ‌ధాని అమ‌రావ‌తి ప్ర‌ధాన మార్గ‌మైన సీడ్ యాక్సెస్‌రోడ్డును ప్రారంభోత్స‌వానికి అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేస్తోంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ఈ ర‌హ‌దారిని ప్రారంభించ‌నున్న త‌రుణంలో వివిధ ర‌కాల అంద‌మైన మొక్క‌లు, చెట్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. క‌డియం ప్ర‌త్యేకంగా న‌ర్స‌రీల నుంచి తీసుకువ‌చ్చిన గోల్డెన్ నీమ్‌, ప్లుమేరియా రుబ్రా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్నాయి. వీటిని ఉండ‌వ‌ల్లిలోని స్టీల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర నుంచి గుంటూరు ఛానెల్‌, కొండ‌వీటివాగుల‌పై నిర్మిస్తున్న మేజ‌ర్ స్టీల్ బ్రిడ్జి వ‌ర‌కు ర‌హ‌దారి మ‌ధ్య‌లో నాటుతున్నారు. ఉండ‌వ‌ల్లి వ‌ద్ద‌ బ‌కింగ్‌హాం కెనాల్‌కు ఇరువైపులా ఉన్న రోట‌రీ భాగాల‌లో మ‌రో 21 ర‌కాల మొక్క‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మంచి ఆక్సిజ‌న్‌తో పాటు చ‌క్క‌టి నీడ‌నిచ్చే స్టెర్క్యూలియా అలాటా, స్పైడర్ లిల్లీ,జెఫిరాంథస్ (వర్షపు), లిల్లీ సింగోనియం, నల్ల ఫౌంటెన్ గడ్డి, ల్యూకోఫిల్లమ్, సాంగ్ ఆఫ్ ఇండియా, క్రాసాండ్రా వంటి మొక్క‌ల‌ను రోట‌రీలో వేస్తున్నారు.
Andhra Pradesh
Amaravati
Seed Access Road
Amaravati Development
Amaravati Development Corporation
ADC
రహదారి మౌలిక వసతులు
గ్రీన్ కారిడార్
ల్యాండ్‌స్కేపింగ్
పట్టణాభివృద్ధి
గోల్డెన్ నీమ్
ప్లుమేరియా రుబ్రా
Scroll for the next article