Technology3rd Aug 05:45 PMSunil Byrisetty1 min read
ఆగస్టు పండుగ తెచ్చిన అమెజాన్
అదిరిపోయే ఆఫర్లతో అమెజాన్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది. ఆగస్టు 7 నుండి భారీ తగ్గింపులతో అమెజాన్ ఆఫర్లు అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా, ఆగస్టు 7 నుండి 'ఫ్రీడమ్ సేల్ 2026
అదిరిపోయే ఆఫర్లతో అమెజాన్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది. ఆగస్టు 7 నుండి భారీ తగ్గింపులతో అమెజాన్ ఆఫర్లు అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా, ఆగస్టు 7 నుండి 'ఫ్రీడమ్ సేల్ 2026'ను ప్రారంభించనుంది. ఈ సేల్లో ఫోన్లు, ల్యాప్టాప్లు, ఏసీలు, ఫ్రిజ్లు వంటి గృహోపకరణాలపై 80% వరకు భారీ తగ్గింపులు లభించనున్నాయి. HDFC బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేసేవారికి అదనంగా 10% వరకు తక్షణ డిస్కౌంట్ కూడా అందుబాటులోకి తెస్తోంది. అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటిస్తోంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఫ్రీడమ్ సేల్ లో ఆఫర్లను అందిపుచ్చుకోవచ్చు.