Electronics13th Dec 02:01 PMSunil Byrisetty1 min read
అమెజాన్‌లో ఆఫర్ల పండుగ.. భారీ తగ్గింపు ధరలు
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేరిట నూతన సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని అమెజాన్ తెలియజేసింది. ఈ సేల్‌లో హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్స్
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేరిట నూతన సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని అమెజాన్ తెలియజేసింది. ఈ సేల్‌లో హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్‌లు తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. బెస్ట్ సెల్లింగ్ గ్యాడ్జెట్లపై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేల్‌లో హెచ్‌పీ 15 ఏఎండీ ప్రాసెసర్ ల్యాప్ టాప్‌ను రూ.30వేల ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఏసర్ ఏస్పయిర్ లైట్ థిన్, లైట్ ప్రీమియం ట్యాప్ టాప్‌లను రూ.34వేల ప్రారంభ ధరకు ఈ సేల్‌లో పొందవచ్చు. డెల్ ఇన్‌స్పిరాన్ 3535 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్‌ను రూ.42,990 ధరకు అందిస్తున్నారు. అలాగే లెనోవో థిన్‌బుక్ 16ను రూ.49,990కి, హెచ్‌పీ 15 ఇంటెల్ ల్యాప్ టాప్‌ను రూ.52,490కి, హెచ్‌పీ ఓమ్నిబుక్ 5 ఓలెడ్ ల్యాప్ టాప్‌ను రూ.61,990కి, అసుస్ టఫ్ గేమింగ్ ఎ15 ను రూ.70,990కి, ఏసర్ నైట్రో వి15 గేమింగ్ ల్యాప్ టాప్‌ను రూ.72,990కి, డెల్ జి సిరీస్ 15 5530 ల్యాప్ టాప్‌ను రూ.75,990 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లను సైతం అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఈఎంఐ వాడితే ప్రొడక్ట్స్‌పై రూ.4500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.3250, హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.3750, వన్ కార్డ్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.3500 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.