News4th Oct 04:24 PMSunil Byrisetty1 min read
అమెరికాలో మాజీ మంత్రి అంబటి కుమార్తె వివాహం
అమెరికాలోని ఇల్లినాయిస్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హర్షతో ఆమె వివాహం హిందూసాంప్రదాయ ప్రకారం జరిగింది. ఈ శుభ కార్యక్రమం మహాలక్ష్మీ ఆలయంలో తెలుగు ఆచారాల ప్రకారం జరిగింది. దగ్గరి బంధువులు,
అమెరికాలోని ఇల్లినాయిస్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హర్షతో ఆమె వివాహం హిందూసాంప్రదాయ ప్రకారం జరిగింది. ఈ శుభ కార్యక్రమం మహాలక్ష్మీ ఆలయంలో తెలుగు ఆచారాల ప్రకారం జరిగింది. దగ్గరి బంధువులు, స్నేహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇండియా నుంచి నుండి చాలా మంది స్నేహితులు, బంధువులు వర్చువల్గా హాజరై తమ ఆశీస్సులను అందించారు. త్వరలోనే ఏపీలో రిసెప్షన్ను కూడా ప్లాన్ చేస్తామని అంబటి రాంబాబు వెల్లడించారు. కాగా డా. శ్రీజ అక్కడే చదువుకుని ప్రస్తుతం ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎండోక్రినాలజీలో ఫెలోషిప్ వర్క్ చేస్తున్నారు. ఆమె భర్త హర్ష యునైటెడ్ స్టేట్స్లోని డ్యూయిష్ బ్యాంక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అంబటి అల్లుడు హర్దది పశ్చిమగోదావరి జిల్లా తణుకు.