Politics15th Mar 06:04 PMSunil Byrisetty1 min read

పవన్ ఒక్క నిజం చెప్పారు.. మిగతావి అర్థం కాలేదా?

పిఠాపురం జయకేతనం సభలో పవన్‌ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున

పవన్ ఒక్క నిజం చెప్పారు.. మిగతావి అర్థం కాలేదా?
పిఠాపురం జయకేతనం సభలో పవన్‌ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్‌ జనసేన స్థాపించారని.. పవన్‌ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు. ‘‘40 ఏళ్ల టీడీపీ ప‌డిపోతుంటే నిల‌బెట్టామ‌ని మాత్రం ఆయ‌న నిజం చెప్పారు. టీడీపీ ప‌డిపోకుండా నిల‌బెట్టడానికి ఏర్పాటు చేసిన పార్టీ జ‌న‌సేన అని మేం మొద‌ట్నుంచి చెబుతూనే ఉన్నాం. కాపు స‌మాజం మీద అనేక దుశ్చర్యల‌కు పాల్పడిన‌ చంద్రబాబు, కాపుల‌ను నేరుగా చేతుల్లోకి తీసుకోలేక టీడీపీ బీ టీమ్‌గా ప‌నిచేయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలో జ‌న‌సేన ఏర్పాటు చేయించారు. కాపుల ఓట్లను త‌న‌వైపు తిప్పుకునే ప్రక్రియ‌లో భాగంగానే ఈ పార్టీ ఏర్పాటు చేయ‌బ‌డింద‌ని మొద‌టి రోజు నుంచి చెబుతూ వ‌స్తున్నాం. చంద్రబాబుకి ఏ ఆప‌ద వ‌చ్చినా కాపు కాయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుకొస్తాడు. కాబ‌ట్టే జ‌న‌సేన పార్టీ మెయింటినెన్స్ బాధ్యత‌ల‌న్నీ కూడా చంద్రబాబే చూస్తారు. కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగ‌బాబు కూడా జ‌గ‌న్ గురించి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడు.. ఎవ‌రిదో ద‌యాదాక్షిణ్యాలుంటే త‌ప్ప గెల‌వలేని అన్నద‌మ్ములు.. ఢిల్లీ కోట‌ను ఢీకొట్టిన జ‌గ‌న్ గురించి మాట్లాడే స్థాయి ఉందేమో ఆత్మవిమ‌ర్శ చేసుకోవాలి. జ‌గ‌న్ ఓట‌మి ఎరుగ‌ని ధీరుడు. పార్టీ పెట్టిన ప‌దేళ్లలో వైయ‌స్సార్సీపీని అదికారంలోకి తెచ్చాడని చ‌రిత్ర చూసి తెలుసుకోవాల’’ని అంబటి రాంబాబు హితవు పలికారు.
Ambati Rambabu
Naga babu
PawanKalyan
Pithapuram
అంబటి రాంబాబు
నాగ బాబు
పవన్ కళ్యాణ్
పిఠాపురం
Scroll for the next article