Politics6th Aug 04:01 PMSunil Byrisetty1 min read
అంబటి పాదయాత్ర వాయిదా?
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించిన పాదయాత్ర వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొందరపడి కోయిల ముందే కూసిందనట్లుగా పాదయాత్ర గురించి చాలా హడావుడి చేశారు. జన సమీకరణ కోసం గుంటూ
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించిన పాదయాత్ర వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొందరపడి కోయిల ముందే కూసిందనట్లుగా పాదయాత్ర గురించి చాలా హడావుడి చేశారు. జన సమీకరణ కోసం గుంటూరు నేతలందర్నీ లైన్లో పెట్టారు. తీరా పాదయాత్రకు రెడీ అనుకునే సమయంలో ప్రెస్మీట్ పెట్టి అబ్బే ఇప్పుడే కాదన్నారు. అందుకు కారణం అధిష్ఠానంతో చర్చించకుండా సొంత పొలిటికల్ మైలేజ్ కోసం ప్రకటించడమేనంటున్నారు. ఇలా నేతలు సొంతంగా పాదయాత్రలు, ఆందోళనలు చేపట్టడంపై అధినేత సీరియస్ అయ్యారని చెబుతున్నారు. అయితే పార్టీ తలపెట్టిన ఆందోళనలకే తాను ప్రాధాన్యత ఇస్తున్నందున తన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని చెప్పుకొచ్చారు.