Education13th Sep 12:29 PMSunil Byrisetty1 min read

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ గడువు పెంపు.!

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువును పెంచినట్లు విద్యార్థులకు అధికారులు తెలిపారు. వర్సిటీ డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ) కోర్సులు, పీజీ (ఎంఏ/ ఎంకాం/ ఎంఎస్సీ, ఎంబీఏ

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ గడువు పెంపు.!
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువును పెంచినట్లు విద్యార్థులకు అధికారులు తెలిపారు. వర్సిటీ డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ) కోర్సులు, పీజీ (ఎంఏ/ ఎంకాం/ ఎంఎస్సీ, ఎంబీఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను చివరి తేదీ సెప్టెంబర్ 26 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నెంబర్‌లు 040-23680 333 / 444 / 555, టోల్‌ఫ్రీ నెంబర్ 18005990101 లో సంప్రదించవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలన్నారు. అలాగే రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు సెప్టెంబర్ 26 చివరి తేదీ అని తెలిపారు.
Ambedkar Open University
Admission Extended
BA BCom BSc
MA MCom MSc MBA
BLisc MLisc
Diploma
Certificate Courses
2025-26 Admissions
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
విద్యా వార్తలు
ఏపీ విశ్వవిద్యాలయాలు
Scroll for the next article