News3rd Oct 01:40 PMSunil Byrisetty1 min read
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. సీఎం సీరియస్
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగ
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దేవళంపేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న ఓ షెడ్డుకు కొందరు ఆగంతుకులు రాత్రి నిప్పు పెట్టారు. ఈ మంటలు క్రమంగా విగ్రహానికి వ్యాపించడంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.