News14th Apr 09:40 AMSunil Byrisetty1 min read
అంబేడ్కర్.. రాజ్యాంగ నిర్మాతే కాదు.. అంతకు మించి..!
డా. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతగానే చాలా మంది అనుకుంటారు. అంతకు మించి ఆయన ఎన్నో ఘనతలు సాధించారు. సింపుల్‌గా తెలుసుకుందాం. అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మోవ్లో జన్
డా. బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతగానే చాలా మంది అనుకుంటారు.
అంతకు మించి ఆయన ఎన్నో ఘనతలు సాధించారు. సింపుల్‌గా తెలుసుకుందాం.
అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మోవ్లో జన్మించారు.
విదేశాల్లో ఎకనామిక్స్ డాక్టరేట్ పొందిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు.
స్వాతంత్య్రం తర్వాత మన దేశానికి తొలి న్యాయ మంత్రిగా సేవలందించారు.
రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా సేవలు అందించారు.
64 సబ్జెక్టుల్లో మాస్టర్స్ చేసి, ఆ తరంలో అత్యంత విద్యావంతులుగా నిలిచారు.
అణగారిన వర్గాలకు విద్య, అంటరాని వారికి సమాన హక్కుల కోసం పోరాటాలు చేశారు.
1956 డిసెంబర్ 6న ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందాం.