News18th Oct 02:52 PMSunil Byrisetty1 min read

అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు అహ్వానం

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వనించారు. సీఎం చంద్రబాబును కడప అమీన్ పీర్ దర్గా పిఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ ఆరిఫుల్లా హుస్సేనీ

అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు అహ్వానం
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వనించారు. సీఎం చంద్రబాబును కడప అమీన్ పీర్ దర్గా పిఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ ఆరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందించారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని... ఈ ఉర్సు మహోత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ఉర్సు మహోత్సవాలకు సహకారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు.
Andhra Pradesh News
Ameen Peer Dargah
Kadapa
Urs Festival
Chandrababu Naidu
Invitation
Arifulla Hussaini
Muslim Festival
Urs Arrangements
ఆహ్వానం
ఆరిఫుల్లా హుస్సేనీ
Scroll for the next article