International7th Apr 08:39 AMSunil Byrisetty1 min read

ట్రంప్‌కు నిరసనల సెగ!

ముందు చూపు లేకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని అమెరికన్లు ఆందోళనలు చేస్తు్న్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస

ట్రంప్‌కు నిరసనల సెగ!
ముందు చూపు లేకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో వాణిజ్య యుద్ధాలు జరుగుతాయని అమెరికన్లు ఆందోళనలు చేస్తు్న్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదే. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయంపైనా నిరసన వ్యక్తం చేశారు. ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో దేశవ్యాప్తంగా 1,200 పైగా ప్రదేశాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘ట్రంప్ గో బ్యాక్’, ‘హాండ్స్ ఆఫ్ డెమోక్రసీ’, ‘మస్క్ వస్ నాట్ ఎలెక్టెడ్’ వంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామీ వంటి నగరాల్లోని స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు.
America
Donald Trump
USA
Protest
Tariff hikes
Scroll for the next article