National7th Oct 04:11 PMSunil Byrisetty1 min read

నిరసనల హీట్.. సీఈసీ పర్యటనలు వాయిదా

ఢిల్లీ, ముంబైలలో సీజేపీ, ఇండి కూటమి వరుస నిరసనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కు హీట్ తగులుతోంది. దీంతో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన అధికారిక పర్యటనలను వాయిదా వేసుకున్నారు. ష

నిరసనల హీట్.. సీఈసీ పర్యటనలు వాయిదా
ఢిల్లీ, ముంబైలలో సీజేపీ, ఇండి కూటమి వరుస నిరసనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కు హీట్ తగులుతోంది. దీంతో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన అధికారిక పర్యటనలను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఛత్తీస్ గఢ్‌లో పర్యటించాల్సి ఉంది. దంతెవాడ, బస్తర్, కవర్ధా లాంటి ప్రాంతాల్లో పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు ఎన్నికల కమిషన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్ పర్యటనకు సంబంధించి సవరించిన తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటంతోనే పర్యటనలను వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ చివరివారంలో ఆయన యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో పర్యటించాల్సి ఉండగా వాయిదా వేసుకున్నారు. జ్ఞానేష్ రాజీనామా చేయాలంటూ 300 మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే.
Scroll for the next article