International6th Aug 11:05 AMSunil Byrisetty1 min read

ట్రంప్‌ పన్నుపోటు.. రష్యాకు అజిత్‌ డోభాల్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై పన్నుల మోత మోగిస్తున్న వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ రష్యా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస

ట్రంప్‌ పన్నుపోటు.. రష్యాకు అజిత్‌ డోభాల్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై పన్నుల మోత మోగిస్తున్న వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ రష్యా పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో ట్రంప్ భారత్‌ పై సుంకాల హెచ్చరికలను తీవ్రతరం చేశారు. భారత్‌- రష్యా సంబంధాలపై ట్రంప్‌ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. రష్యా చమురు సరఫరాతో పాటు ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలు, ఎస్‌యూ-57 యుద్ధ విమానాల కొనుగోలుపై డోభాల్‌ చర్చలు జరిపే అవకాశం ఉంది. మరోవైపు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఈ నెలాఖరులో రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య రక్షణ, ఇంధన, వాణిజ్య చర్చలే లక్ష్యంగా ఆయన పర్యటన ఉండనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Donald Trump
US-India trade tensions
India-Russia relations
Ajit Doval Russia visit
S-400 missile deal
SU-57 fighter jets
Russian oil imports
India foreign policy
Jaishankar Russia visit
defense cooperation
energy talks
India-US tariffs
Scroll for the next article