International21st Aug 10:44 AMSunil Byrisetty1 min read

భారత్‌కు రండి.. రష్యా కంపెనీలకు ఆహ్వానం

భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా సంస్థలను విదేశాంగ మంత్రి జై శంకర్ ఆహ్వానించారు. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరచుకోవాలని పిలుపునిచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోల

 భారత్‌కు రండి.. రష్యా కంపెనీలకు ఆహ్వానం
భారత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా సంస్థలను విదేశాంగ మంత్రి జై శంకర్ ఆహ్వానించారు. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరచుకోవాలని పిలుపునిచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని అమెరికా ఒత్తిడి తెస్తున్న వేళ జైశంకర్ మాస్కోలో కీలక పర్యటన చేపట్టారు.రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్తో భేటీ అయిన ఆయన వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరలో భారత్లో పుతిన్ పర్యటనకు సంసిద్ధత లక్ష్యంతో విదేశాంగ మంత్రి పర్యటన కొనసాగుతోంది.భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని గుర్తుచేశారు. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో విదేశీ వాణిజ్యానికి కొత్త ద్వారాలు తెరిచిందన్నారు.
India news
Jaishankar Russia Visit
India Russia Relations
Indian Economy
Foreign Investments
Make in India
Putin India Visit
India Russia Trade
Oil Imports
Indo-Russia Cooperation
Scroll for the next article