News16th Dec 01:04 PMSunil Byrisetty1 min read

నియోజకవర్గాల పునర్విభజనపై అమిత్ షా!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై స్పందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేశారు. తనను కలిసిన పలు రాష

నియోజకవర్గాల పునర్విభజనపై అమిత్ షా!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై స్పందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేశారు. తనను కలిసిన పలు రాష్ట్రాలఎంపీలతో అమిత్ షా ఈ విషయం చెప్పారు. జనగణన నిర్దేశిత సమయానికే పూర్తవుతుందని అమిత్ షా అన్నారు. జనగణనకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిదే. ఈ జనగణన రెండు దశలలో పూర్తి కానుంది. ఇలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. డీలిమిటేషన్లో ఎస్సి ఎస్టీలకు రిజర్వేషన్లతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే 2027 నాటికి జనాభా లెక్కల సేకరణ పూర్త వుతుందనీ, ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలవుతుందని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
Amit Shah
Constituency Delimitation
Delimitation Process
Indian Politics
Lok Sabha Elections
Census 2027
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్
కేంద్ర హోంమంత్రి
సార్వత్రిక ఎన్నికలు
Scroll for the next article