News7th May 04:16 PMSunil Byrisetty1 min read
అమిత్ షా అత్యవసర సమీక్ష.. రేపు అఖిలపక్షం
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌పై దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం అలర్టైంది.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌పై దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది.
ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమీక్ష చేపట్టారు.
పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్‌లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు.
ఈ సమీక్ష సమావేశానికి జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం సీఎంలు హాజరయ్యారు.
లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.
రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
అన్ని పార్టీలతో చర్చించి పోరుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.