Education26th Jul 03:24 PMSunil Byrisetty1 min read
అమ్మ అక్షరదీపం వేల ఆశయాలకు వెలుగు
విద్య అనేది ఎవరూ దోచుకోలేని సంపదని.. ఒక విద్యార్థికి అందించే సహాయం ఒక కుటుంబ భవిష్యత్తును వెలిగించే దీపమని... ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అందించే చేయూతతో విద్యార్థుల క
విద్య అనేది ఎవరూ దోచుకోలేని సంపదని.. ఒక విద్యార్థికి అందించే సహాయం ఒక కుటుంబ భవిష్యత్తును వెలిగించే దీపమని... ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అందించే చేయూతతో విద్యార్థుల కలలకు రెక్కలు వస్తాయని భవితకు భరోసా ఇస్తుందని NTR జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడం అంటే దేశ భవిష్యత్తును నిర్మించడమని అన్నారు. ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డంకిగా మారకుండా వివిధ పథకాల ద్వారా విద్యార్థులకు చేయూత అందిస్తూ, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను ప్రభుత్వం విస్తృతం చేస్తోందని పేర్కొన్నారు.
విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, విజ్ఞానం, సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో దాదాపు 70 వేల బంగారు కుటుంబాలకు 7,000 మంది మార్గదర్శులు ద్వారా చేయూత లభిస్తోందని తెలిపారు. అమ్మ సంస్థ తరహాలో ఎంతోమంది వ్యక్తిగతంగా, సంస్థల పరంగా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షులు గారపాటి సతీష్ బాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది 425 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో రూ. 21.30 లక్షలు, రూ. 60 వేల విలవగల నోట్ బుక్స్ ను అందజేస్తున్నామని తెలిపారు.