News4th Nov 10:54 AMSunil Byrisetty1 min read

అమరావతికి పుష్కలంగా నిధులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి నిధులు పుష్కలంగా సమకూరుతున్నాయి. సీఆర్డీఏకు మరో రూ. 32,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఆమోదం తెలిపింది. ప్

అమరావతికి పుష్కలంగా నిధులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి నిధులు పుష్కలంగా సమకూరుతున్నాయి. సీఆర్డీఏకు మరో రూ. 32,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కన్సార్షియంతో పాటు నాబార్డ్, ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ, ఏపీపీఎఫ్‌సీ వంటి దేశీయ సంస్థలు ఈ నిధులు సమకూరుస్తున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ కింద ఈ రుణాలు మంజూరు అవుతున్నాయి. అమరావతి కోసం రూ. 1,500 కోట్ల రుణానికి సంబంధించి ఏపీపీఎఫ్‌సీతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ప్రపంచ బ్యాంకు-ఏడీబీ రూ. 14,000 కోట్లు , ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ రూ. 10,000 కోట్లు , నాబార్డ్ రూ. 7,000 కోట్లు ఇస్తున్నాయి. సీఆర్డీఏ ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ.11,000 కోట్లు కలిపి మొత్తం ₹26,000 కోట్ల రుణాలు సమీకరించింది. ఈ కొత్త రుణంతో అమరావతి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు చాలావరకు సమకూరనున్నాయి. అమరావతి ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు మొదటి నుంచి సానుకూల వైఖరి చూపుతోంది.
Andhra Pradesh
Amaravati
World Bank
Infrastructure Development
CRDA
ADB
NABARD
NABFID
AP Government
Development Funds
రాజధాని నిర్మాణం
అభివృద్ధి నిధులు
ఆర్థిక సహాయం
అమరావతి ప్రాజెక్ట్
Scroll for the next article